60 ఏళ్ల వయసులో మాజీ కేంద్రమంత్రి పెళ్లి
మహారాష్ట్రకు చెందిన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. ముకుల్ వాస్నిక్, ఆయన స్నేహితురాలు రవీనా ఖురానాలు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో అదికొద్ది మంది అతిథుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్ మరికొందరు నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముకుల్ వాస్నిక్ గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఒకనొక దశలో రాహుల్ గాందీ రాజీనామా తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్ పేరు కూడా ప్రముఖంగా వినిపించిది. కాంగ్రెస్ పార్టీలో ముకుల్ అనేక బాధ్యతలు నిర్వర్తించారు.













