తానా ఎన్నికలు…ఏకగ్రీవాలు…పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్ కమిటీకి, బోర్డ్ డైరెక్టర్ పదవులకు జరగనున్న ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. కొన్ని పదవులకు ఇప్పటికే అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరికొన్ని పదవులకు పోటీ తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2019-23 సంవత్సరానికిగాను తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. అంజయ్య చౌదరి లావు, నరేన్ కొడాలి ఈ పదవికోసం నామినేషన్లు వేశారు. నరేన్ కొడాలి నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో అంజయ్య చౌదరి వైస్‌ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శి పదవికి రవి పొట్లూరి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ట్రెజరర్ పదవికి సతీష్ వేమూరి, జాయింట్ సెక్రటరీ పదవికి అశోక్‌బాబు కొల్లా, జాయింట్ ట్రెజరర్ పదవికి వెంకట్ కోగంటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి మల్లికార్జున వేమన, శ్రీకాంత్ పోలవరపు పోటీ పడుతున్నారు. కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి సునీల్ పాంత్రా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి శిరీష తూనుగుంట్ల, కౌన్సిలర్ ఎట్ లార్జ్ పదవికి వినయ్‌కుమార్ మద్దినేని, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ పదవికి లక్ష్మీ దేవినేని, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పదవికి లోకేష్ కొణిదెల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రీజినల్ రిప్రజంటేటీవ్ (న్యూఇంగ్లాండ్) పదవికి కోటేశ్వరరావు కందుకూరి, రీజినల్ రిప్రజంటేటీవ్ (న్యూయార్క్) పదవికి సుమంత్ రామ్సెట్టి, రీజినల్ రిప్రజంటేటీవ్ (న్యూజెర్సి) పదవికి వెంకట్ రాజా కసుకుర్తి, రీజినల్ రిప్రజంటేటీవ్ (మిడ్ అట్లాంటిక్) పదవికి సతీష్ చుండ్రు, రీజినల్ రిప్రజంటేటీవ్ (క్యాపిటల్) పదవికి అనిల్ సి. ఉప్పలపాటి, రీజినల్ రిప్రజంటేటీవ్ (సౌత్ ఈస్ట్) పదవికోసం కిరణ్ గోగినేని, రీజినల్ రిప్రజంటేటీవ్ (నార్త్) పదవికి కిరణ్ దుగ్గిరాల, రీజినల్ రిప్రజంటేటీవ్ (ఒహాయోవ్యాలీ) పదవికి శ్రీనివాస ఆర్. యలవర్తి, రీజినల్ రిప్రజంటేటీవ్ (మిడ్వెస్ట్) పదవికి విజయ కృష్ణ మోహన్ చిల్మకూర్, రీజినల్ రిప్రజంటేటీవ్ (నార్త్ సెంట్రల్) పదవికి సాయి వినోద్ తోటకూర, రీజినల్ రిప్రజంటేటీవ్ (సదరన్ కాలిఫోర్నియా) పదవికి సురేష్ సి. కందెపు, రీజినల్ రిప్రజంటేటీవ్ (నార్తర్న్ కాలిఫోర్నియా) పదవికి రజనీకాంత్ కాకర్ల, రీజినల్ రిప్రజంటేటీవ్ (నార్త్ వెస్ట్) పదవికి దేవేంద్రలావు, రీజినల్ రిప్రజంటేటీవ్ (రాక్మౌంటెన్) పదవికోసం నవీన్ కలగర నామినేషన్ వేశారు. వీరంతా ఈ పదవులకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాగా రీజినల్ రిప్రజంటేటీవ్ (అప్పలచియాన్) పదవికి నాగమల్లేశ్వరరావు పంచుమర్తి, సురేష్ బాబు కాకర్ల పోటీ పడుతున్నారు. రీజినల్ రిప్రజంటేటీవ్ (సౌత్ సెంట్రల్) పదవికోసం కిషోర్ యార్లగడ్డ, శ్రీధర్ తాళ్ళూరి, రీజినల్ రిప్రజంటేటీవ్ (డిఎఫ్‌డబ్ల్యు) పదవికి ప్రవీణ్ కొడాలి, సాంబయ్య దొడ్డా పోటీ పడుతున్నారు. రీజినల్ రిప్రజంటేటీవ్ (సౌత్ వెస్ట్) పోస్ట్‌కు మురళీ తాళ్ళూరి, రత్నప్రసాద్ గుమ్మడి పోటీ పడుతున్నారు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి పలువురు పోటీ పడుతున్నారు. నాన్ డోనర్ డైరెక్టర్ కేటగిరిలో రెండు పోస్టులకు గాను హనుమయ్య బండ్ల, మురళి వెన్నం, శ్రీనివాస లావు పోటీ పడుతున్నారు. డోనర్ డైరెక్టర్ కేటగిరిలో రెండు పోస్టులకు గాను చౌదరి జంపాల నామినేషన్ వేశారు.
తానా ఫౌండేషన్ ట్రస్టీ పదవులకు కూడా పలువురు పోటీ పడుతున్నారు. 4 సంవత్సరాల పదవికాలం ఉన్న 7 ట్రస్టీ పదవులకోసం పలువురు నామినేషన్లు వేశారు. భక్తబల్లా, జానయ్యకోట, రాజా సూరపనేని, రవి సామినేని, సత్యనారాయణ మన్నె, శ్రీనివాస్ చంద్ గొర్రెపాటి, వెంకట్ ఆర్. యార్లగడ్డ, విశ్వనాథ్ నాయునిపాటి నామినేషన్లు దాఖలు చేశారు. ఫౌండేషన్ ట్రస్టీ 2 సంవత్సరాల పదవికాలం ఉన్న ఒక్కపోస్టుకోసం?రావు యలమంచిలి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఫౌండేషన్ డోనర్ ట్రస్టీ నాలుగు సంవత్సరాల పదవీకాలం ఉన్న రెండు పోస్టులకు రమాకాంత్ కోయ, సురేష్ పుట్టగుంట నామినేషన్లు వేశారు. వీరిద్దరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.
ఈసారి ఎన్నికల్లో పలు ముఖ్యమైన పోస్టులకు ఏకగ్రీవంగా ఎంపిక జరగడం విశేషం. తానాలో పోటీని నివారించడానికి తానా పెద్దలు స్వయంగా జోక్యం చేసుకోవడంతో కీలకమైన పోస్టులకు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యే అవకాశం లభించింది.













