కివీస్‌ను చిత్తు చేసిన సఫారీలు
ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జట్లలో సౌతాఫ్రికా ఒకటి. ఈ టీం తాజాగా బలమైన న్యూజిల్యాండ్‌కు షాకిచ్చింది. పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. క్వింటన్ డీ కాక్ (114), వాన్ డర్ డస్సెన్ (133), డేవిడ్ మిల్లర్ (53) అద్భుతంగా రాణించారు. దీంతో ఆ టీం 357 పరుగుల స్కోరు చేసింది. ఛేజింగ్‌లో న్యూజిల్యాండ్ తడబడింది. విల్ యంగ్ (33), డారియల్ మిచెల్ (24), గ్లెన్ ఫిలిప్స్ (60) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగతా అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో ఆ జట్లు కేవలం 167 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో యాన్సెన్ 3, గెరాల్డ్ కోట్జీ 2 వికెట్లతో రాణించారు. అద్భుతమైన శతకంతో రాణించిన డస్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













