సివిల్స్ అభ్యర్థులకు మరో అవకాశం : సుప్రీంకోర్టు
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు కోవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల రాయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. కోవిడ్ వల్ల పరీక్షలకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు పెట్టుకున్న అప్పీల్‌ను పరిశీలించిన కోర్టు కేంద్రాన్ని కోరింది. పరీక్ష మిస్సైన వారికి అదనపు పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని కోర్టు తన సూచనలో పేర్కొన్నది. రెండు వారాల్లోగా దీనిపై నిర్ణయాన్ని వెల్లడిరచాలని కోర్టు చెప్పింది. పార్లమెంటరీ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.













