ఎక్కడున్నా తక్షణమే లొంగిపో.. లేదంటే… మాజీ ప్రధాని వార్నింగ్

లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. విదేశాల్లో ఉన్న ఆయనను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, ఆయన కుటుంబీకుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ్ మరోసారి స్పందించారు. ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజ్వల రేవణ్ణ గురించి మే 18న ఓ ఆలయానికి వెళ్తూ మీడియాతో మాట్లాడా. అతడు నాకు, నా కుటుంబం, పార్టీ, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ కేసులో దోషిగా తేలితే కఠినశిక్ష పడాల్సిందే నా కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి కూడా ఇదే వైఖరితో ఉన్నాడు. ప్రజ్వల్ ఎక్కడున్నా వచ్చి పోలీసుల ముందు లొంగిపో. నా సహనాన్ని పరీక్షించవద్దు. ఇది నా విజ్ఞప్తి కాదు, వార్నింగ్. లేదంటే నాతోపాటు కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురవుతావ్ అని దేవెగౌడ్ పేర్కొన్నారు.