రాజకీయాల్లోకి రాను.. నా నిర్ణయంలో మార్పు లేదు
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు చెన్నైలో భారీ ప్రదర్వన నిర్వహించడంపై ఆయన స్పందించారు. తాను రాజకీయాల్లోకి రాబోనని, ఆ విషయంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని రజనీకాంత్ సృష్టం చేశారు. రజనీ మక్కల్ మంద్రమ్ నుంచి బహిష్కరణకు గురైన శ్రేణులతో కలిసి తన అభిమానులు కొందరు చెన్నైలో ప్రదర్శన నిర్వహించారని, రాజకీయాల్లోకి రానంటూ తన తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ ప్రదర్శనలో డిమాండ్ చేశారని రజనీకాంత్ గుర్తు చేశారు.
అయితే, తాను తీసుకోవాల్సిన నిర్ణయం ఇప్పటికే తీసుకున్నానని, ఇక ఆ నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచన లేదని తెలిపారు. నేను ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. నేనంటే గిట్టని వాళ్లు చేసే ఇలాంటి ప్రదర్శనల్లో దయచేసి పాలుపంచుకోకండి అని తన అభిమానులను ఉద్దేశించి రజనీకాంత్ వ్యాఖ్యానించారు. అలాంటి ఘటనలు తనను బాధిస్తాయని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.













