సభలన్నింటినీ రద్దు చేసుకుంటున్నా : రాహుల్ సంచలన ప్రకటన
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఏ బహిరంగ సభలోనూ పాల్గొనడం లేదని ప్రకటించారు. అన్ని సభలనూ రద్దు చేసుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. భారీ బహిరంగ సభల వల్ల ప్రస్తుత రోజుల్లో ఎదురయ్యే పర్యవసానాలను అన్ని రాజకీయ పార్టీలూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. 6,7,8 దశల ముందు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు.
రాహుల్ నిర్ణయంపై నెటిజన్ల హర్షం
కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో బెంగాల్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలను రద్దు చేసుకుంటున్నట్లు రాహుల్ ప్రకటించారు. దీనిపై అన్ని రాజకీయ పక్షాలూ ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాహుల్ నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం, సానుభూతిపరులు అందరూ ‘మై లీడర్ రాహుల్ గాంధీ’ అంటూ హ్యాష్‌ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ట్విట్టర్లో ‘మై లీడర్ రాహుల్ గాంధీ’ అన్న హ్యాష్‌ట్యాగే టాప్‌లో ఉంది.













