సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఇటీవల మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈ ఇద్దరి రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ఆమోదించారని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పదవులు పోషిస్తున్న వీరిద్దరూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయ్యారు. ఈ క్రమంలోనే తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. ఈ నెల 1న రాష్ట్రపతికి పంపించారు. ఆమె వీటిని తాజాగా ఆమోదించినట్లు హోంశాఖ వెల్లడించింది. అలాగే తమ కేబినెట్లోకి అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను తీసుకుంటామని కేజ్రీవాల్ సర్కారు తెలుపగా.. దీనికి కూడా అనుమతి లభిచింది.













