బీహార్ నుంచి నా తొలి అడుగు
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలిసిందే. అందరూ ఊహించినట్లుగానే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పదేళ్లుగా తాను ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని ఆయన తెలిపారు. ప్రజా ససమ్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉందని, ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాని, బీహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. బీహార్‌లో తన రాజకీయ కార్యకలాపాల కోసం ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.













