ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన రద్దు

వచ్చే నెల బ్రిటన్‍లో జరిగే జీ-7 సదస్సుకు వెళ్లాల్సి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా కారణంగా తనన పర్యటనను రద్దు చేసుకున్నారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ లండన్ పర్యటన నుంచి తిరిగివచ్చిన కొద్ది రోజులకే ప్రధాని పర్యటన రద్దు ప్రకటన వెలువడింది. జీ-7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితునిగా తనను పిలిచినందుకు బ్రిటన్ బోరిస్ జాన్సన్‍కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో కొవిడ్ కారణంగా ఈ సదస్సుకు తాను భౌతికంగా హాజరు కాలేనని చెప్పినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరింద్ బాగ్చి తెలిపారు.