ప్రధాని మోదీని కలిసిన హరియాణా గవర్నర్ దత్తాత్రేయ

హరియాణా గవర్నర్ బంగారు దతాత్రేయ కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మోదీకి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భగా ప్రధాని హరియాణాలోని తాజా పరిస్థితులను దత్తాత్రేయను అడిగి తెలుసుకున్నారు. ప్రధానిని కలిసినవారిలో దత్తాత్రేయ సతీమణి వసంత, కుమార్తె విజయలక్ష్మి, అల్లుడు జిగ్నేష్, మనుమరాళ్లు, జశోధర, వేదాంశిలు ఉన్నారు. ఈ సందర్భంగా తన ముందు పాటపాడి అలరించిన దతాత్రేయ మనుమరాళ్లను ప్రధాని మోదీ అభినందించారు.