అమెరికా ఘటనపై ప్రధాని మోదీ స్పందన
అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద చోటు చేసుకున్న ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. వాషింగ్టన్లో హింసాత్మక చర్యలు బాధ కలిగించాయి. అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలి. నిరసనలతో ప్రజాస్వామ్య పక్రియను ఆటంకపరచడం సరికాదు అని మోదీ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ డీసీలోని యూఎస్ కాంగ్రెస్ క్యాపిటల్ భవనంలో సమావేశం కాగా, ట్రంప్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో భవనం వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.













