అయోధ్య కోసం ఏదైనా చేయాలని ఉంది … భవిష్యత్తులో ఆ దిశగా
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు తరలివచ్చారు. 500 ఏళ్ల నాటి కల సాకారమైందంటూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఇది నాకెంతో ఉద్వేగభరితమైన రోజు. ప్రాణప్రతిష్ట సమయంలో తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. ఎన్నో ఏళ్ల కల నెరవేరిన క్షణాలివి. ఇది భారత్‌ను మరింత ఏకం చేస్తుంది. రానున్న రోజుల్లో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నా. అయోధ్య కోసం ఏదైనా చేయాలని ఉంది. భవిష్యత్తులో ఆ దిశగా ప్రయత్నిస్తా అని అన్నారు.













