నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు…
నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కుమార్ దహల్ ప్రచండ వివాదంలో చిక్కుకున్నారు. తనను ప్రధానిని చేసేందుకు నేపాల్లో స్థిరపడిన ఓ భారత వ్యాపారి గతంలో సాయం చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హిమాలయ దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాఠ్మాండూలో స్థిరపడిన ప్రముఖ భారత వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్ సింగ్ జీవితకథపై రచించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని ప్రచండ మాట్లాడుతూ నేపాల్`భారత్ బంధాన్ని బలోపేతం చేయడంలో సర్దార్ ప్రీతమ్ సింగ్ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ఓసారి నన్ను ప్రధానిగా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనేకసార్లు ఢిల్లీ వెళ్లారు. కాఠ్మాండూలోని రాజకీయ నేతలతో పలు మార్లు చర్చలు జరిపారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాస్తా నేపాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.













