మెట్రోమ్యాన్ శ్రీధరన్ సంచలన నిర్ణయం …
బీజేపీ నేత, మెట్రోమ్యాన్ శ్రీధరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని సంచలన ప్రకటన చేశారు. తనకు తత్వం బోధపడిరదని, ఎన్నికల బరిలోకి దిగి గుణపాఠం నేర్చుకున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలప్పురం వేదికగా శ్రీధరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను నేతాగిరీ ఎన్నడూ చేయలేదని, రాజకీయ నేతగా ఎన్నడూ లేనిని పేర్కొన్నారు. ప్రస్తుతం నాకు 90 ఏళ్లు. ఇంకా రాజకీయాల్లో ఉండడం, రాజకీయాలను కెరీర్ కొనసాగిస్తే చాలా ప్రమాదం. రాజకీయాలను చేయడం నా కల కూడా కాదు అని శ్రీధరన్ స్పష్టం చేశారు.













