కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు కీలక నిర్ణయం… తక్షణమే ఇది అమల్లోకి
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ కార్యాలయంలో నలుగురు కీలక నేతలను నియమించారు. రాజ్యసభ ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్, ప్రణవ్ రaా, గుర్దీప్ సింగ్ సప్పల్, గౌరవ్ పాంధిలను ఏఐసీసీ సమన్వయకర్తలుగా నియమిస్తూ ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఈ నలుగురినీ పార్టీ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ అధికార ప్రకటన విడుదల చేసింది.
గుర్దీప్ సింగ్ సప్పల్ గతంలో భారత ఉపరాష్ట్రపతి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేశారు. రాజ్యసభ సీఈవోగానూ సేవలందించారు. ప్రణవ్ రaాకు ఏఐసీసీ కమ్యూనికేషన్ విభాగంలో కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఖర్గే నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి.













