కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరో అరుదైన ఆహ్వానం
క్యూబా రాజధాని హవానాలో జరిగే 41వ అంతర్జాతీయ టూరిజం ఫేర్ (ఫిట్ క్యూబా)కు హాజరుకావాలంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందింది. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సంలో పాల్గొనేందుకు రావాలంటూ కిషన్ రెడ్డికి క్యూబా పర్యాటక మంత్రి జువాన్ కార్లోస్ కార్సియా గ్రాండా లేఖ రాశారు. జీ 77G చైనా సమావేశాలకు క్యూబా నేతృత్వం వహిస్తుండగా మే 5వ తేదీన ఏర్పాటు చేయనున్న మంత్రుల స్థాయి పర్యాటక సదస్సులో కిషన్ రెడ్డి పాల్గొని, ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల కోసం పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై విలువైన సూచనలు చేయాలంటూ ఆ లేఖలో కార్సియా పేర్కొన్నారు.













