కేరళ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ …
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్‌గా పేరొందిన ఈ శ్రీధరన్ పేరును బీజేపీ ప్రకటించింది. శ్రీధరన్ గత నెలలో కాషాయ పార్టీలో చేరారు. కేరళ సీఎం పదవిని చేపట్టేందుకు సిద్దమని బీజేపీ గూటికి చేరిన శ్రీధరన్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేవారు. సీఎం రేసులో మెట్రో మ్యాన్ శ్రీధరన్ ముందువరుసలో నిలిచారని బీజేపీ కేరళ చీఫ్ కే సురేంద్రన్ వెల్లడించారు. బీజేపీ అదికారంలోకి వస్తే సీఎం పదవిని చేపట్టేందుకు సిద్ధమని, కేరళ అభివృద్ధికి తన నాయకత్వం అవసరమని ఫిబ్రవరి 19న శ్రీధరన్ పేర్కొన్నారు. కేరళ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందితే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడవేయడంతో పాటు మౌలిక వసతులను అభివృద్ధి చేస్తానని ఆయన సృష్టం చేశారు. కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని అందుకే తాను కాషాయ పార్టీలో చేరానని శ్రీధరన్ చెప్పుకొచ్చారు.













