కాంగ్రెస్ పార్టీలో చేరిన కన్హయ్య, జిగ్నేష్
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ (సీపీఐ) నేత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధినేత కన్హయ్య కుమార్, గుజరాత్‌లోని వడగావ్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమ నాయకుడు జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వీరిద్దరి చేరిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవాని కి పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో కన్హయ్య కుమార్, జిగ్నేష్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా పురాతన పార్టీ అని అన్నారు. అత్యధిక ప్రజాస్వామ్య విలువలు ఉన్న పార్టీని కీర్తించారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేశం మనలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఓడ లాంటిదని, ఈ పార్టీని కాపాడుకుంటే దేశ ప్రజల ఆకాంక్షలను, మహాత్మగాంధీ ఏకత్వాన్ని భగత్‌సింగ్ స్థైర్యాన్ని, బీఆర్ అంబేద్కర్ సమానత్వ ఆలోచనను కాపాడుకున్నట్లేనని అన్నారు. అందకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు.













