లాలూ ప్రసాద్ యాదవ్కు .. బెయిల్ మంజూరు
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జీడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణం కేసులో అరెస్టై శిక్ష అనుభవిస్తున్న లాలుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కాగా లాలూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1990ల్లో బీహార్లో దాణా కుంభకోణం కేసు చోటు చేసుకుంది. ఈ కేసులో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్షణతో పాటు రూ.60 లక్షల జరిమానా విధించింది. డోరండ ట్రెజరీ నుంచి రూ.139.5 కోట్లను చట్ట విరుద్ధగా విత్ డ్రా చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో ఐదేళ్ల పాటు శిక్ష పడిన లాలూ ఇప్పటికే 42 నెలలు జైలులో గడిపారు.













