కీలక అప్ డేట్ ఇచ్చిన ఇస్రో
సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య -ఎల్ స్పేస్‌క్రాఫ్ట్‌ను భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించనున్నది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11.50 నిమిషాలకు ఆ ప్రయోగం ఉంటుందని ఇస్రో తెలిపింది. శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇండియా తొలిసారి ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపడుతోంది. సూర్యుడి-భూమి కక్ష్యలోని లగరేంజ్ పాయింట్(ఎల్-1) వద్ద ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఉంచుతారు. ఆ పాయింట్ భూమికి దాదాపు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎల్-1 పాయింట్లో శాటిలైట్‌ను నిలపడం వల్ల సూర్యుడిని నిరంతరం చూసే అవకాశం ఉంటుందని ఇస్రో ఓ ప్రకటనలో చెప్పింది. ఆ పాయింట్ నుంచి గ్రహణ సమయంలోనూ ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇస్రో వెల్లడించింది. దీని వల్ల సూర్యుడి అధ్యయనం సులువు అవుతుందని, రియల్ టైంలో స్పేస్ వెదర్‌పై కలిగే ప్రభావాన్ని స్టడీ చేయవచ్చు.













