అందాల పోటీలో శ్రావ్య చిల్లకు కిరీటం
ఢిల్లీ నోయిడాలో మిస్ అండ్ మిసెస్ ఇండియా క్వీన్ ఆఫ్ ఆర్ట్స్ సంస్థ నిర్వహించిన అందాల పోటీలలో హైదరాబాద్ నగరానికి చెందిన శ్రావ్య చిల్ల సౌత్ ఇండియా క్రౌన్‌ను సాధించి అందాల రాణిగా నిలిచారు. సౌత్ ఇండియా క్రౌన్‌తో పాటు మిసెస్ ఫిట్, మిసెస్ ఫర్ఫెక్ట్ బాడీ -2024 రెండు సబ్ టైటిల్స్‌ను కూడా సాధించానని శ్రావ్య చిల్ల తెలిపారు. ఫైనల్‌కు 36 మంది ఎంపిక కాగా వారిలో తనకు ఐదు రాష్ట్రాల సౌత్‌జోన్ కీరిటం వరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు గత 6 నెలులుగా ఫిట్నెస్, క్యాట్‌వాక్, మాట్లాడే విధానం, ప్రశ్నోత్తరాలపై శిక్షణ పొందడం జరిగిందన్నారు. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని, ఇద్దరు పిల్లల తల్లిని అయినప్పటికీ పట్టుదలతో ఈ టైటిల్ సాధించానని తెలిపారు. ఈ విజయంలో తన కుటుంబ సహకారం మరువలేనిదని ఆమె అన్నారు.













