ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు

చైనా, పాకిస్థాన్‌లతో సరిహద్దుల్లో సుదీర్ఘ కార్యాచరణ అనుభవమున్న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 30వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రిటైరయ్యారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022-2024 సంవత్సరాల మధ్య ఆయన జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ ఆఫ్ నార్తర్న్ కమాండ్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక స్కూల్ విద్యార్థి అయిన జనరల్ ద్వివేది 1984లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్‌లో చేరారు. పరమ విశిష్ట సేవ, అతివిశిష్ట సేవ పతకాలు పొందారు.