ఐదేళ్ల తరువాత బాహ్య ప్రపంచంలోకి డేరాబాబా
డేరాబాబా గుర్మీత్ రాం రామ్ రహీమ్ సింగ్ జైలు నుంచి వెలుపలికి వచ్చారు. రెండు దశాబ్దాల క్రితం నాటి మర్డర్ కేసుతో పాటు ఇద్దరు మహిళలను రేప్ చేసిన కేసుల్లో రోప్తక్ లోని సునారియా జైల్లో డేరా బాబా జీవితఖైదును అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు 21 రోజుల సెలవును హర్యానా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరుగునున్న తరుణంలో డేరా బాబాకు సెలవు మంజూరు చేయడం గమనార్హం. పంజాబ్లో డేరా బాబాకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులున్నారు. ఏ ఎన్నికలను అయినా వారు ప్రభావితం చేసేంత పరిస్థితి ఉంది.













