అమెరికా పురస్కారం ఎంతో గౌరవం : మోదీ
అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన లెజియన్ ఆఫ్ మెరిట్ ను పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో ఇరదేశాల కృషిని ఇది గుర్తించిందని అభిప్రాయపడ్డారు. ఈ 21వ శతాబ్దం ఇరు దేశాలకు ఎన్నో సవాళ్లతో పాటు మరెన్నో అవకాశాలను ముందుంచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికాతో మా ప్రభుత్వం కలిసి పనిచేస్తుందనే విశ్వాసాన్ని నిబద్ధతను 130 కోట్ల మంది భారతీయుల తరపున సృష్టం చేస్తున్నానని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఇక ఇరు దేశాల వ్యూహాత్మక బంధాన్ని ముందకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన చొరవకు ఈ అవార్డును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహుకరిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ అవార్డును అందిస్తుంటుంది.













