కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం… ఉద్యోగులకు

కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట కల్పిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని వర్గాలకు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే గర్భిణి ఉద్యోగులు, మానసిక వికలాంగులైన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతరులైన 50 శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరు అవ్వాలని సూచించింది. కంటైన్‍మెంట్ జోన్ల పరిధిలో ఉన్న ఉద్యోగులకు 50 శాతం అటెండెన్స్ నుంచి మినహాయించారు. వీరంతా టెలిఫోన్‍లో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఈ నిబంధనలు మే 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.