యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు
ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీర్ ఏర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు పటియాలా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని ఎన్ఐఏ కోర్టుకు సూచించింది. అయినా న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ మాత్రం యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. కశ్మీర్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో మాలిక్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. ఈ కేసులో యాసిన్ మాలిక్‌తో పాటు లష్కర్ ఎ తొయిబా వ్యవస్థాపకుడు హఫిజ్ సయిద్, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సయ్యద్ సలాహుద్దీన్ పేర్లు కూడా ఎన్ఐఏ ఛార్జ్ షీట్లో ఉన్నాయి. తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ యాసిక్ మాలిక్ కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించాడు.













