ఈ సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షి
ఈ సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్‌కు తరలివెళ్లే ముందు ఉభయ సభల సభ్యుల పాత భవనంలోకి సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వారసత్వంపై అందులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. పాత పార్లమెంట్ భవనం ఇకపై సంవిధాన్ సదన్ గా ఉండనుందని తెలిపారు. పార్లమెంట్లో ఈ సమావేశం ఎంతో భావోద్వేగంతో కూడుకుంది. ఈ సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షి. మన రాజ్యాంగం ఈ సెంట్రల్ హాలోనే రూపుదిద్దుకుంది. ఆంగ్లేయుల నుంచి రాజ్యాధికారం అందుకున్నది కూడా ఈ సెంట్రల్ హాలోలోనే. 1952 నుంచి 41 మంది వివిధ దేశాధ్యక్షులు ఇక్కడే ప్రసంగించారు. రాష్ట్రపతులు 86 సార్లు ఇక్కడ తమ ప్రసంగాలను వినిపించారు. ఇక్కడి నుంచే 4 వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నాం. అనేక కీలక చట్టాలను ఉమ్మడి సమావేశాల ద్వారా ఆమోదించుకున్నాం. తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ట్రిపుల్ తలాక్ చట్టాలు ఇక్కడే ఆమోదం పొందాయి. ఆర్టికల్ 370 నుంచి విముక్తి కూడా పార్లమెంట్ ద్వారానే జరిగింది. దాంతో ప్రస్తుతం జమ్మూకశ్మీర్ శాంతపథంలో పయనిస్తోంది అని అన్నారు.













