మీరు ఓటు వేయకపోయినా కనీసం.. ఆశీస్సులైనా అందించాలి

మీకు కుమారుడికి ఓటేయకపోయినా కనీసం అతడిని ఆశీర్వదించండి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. ఆంటోనీ కుమారుడు అనిల్ బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అనిల్ గతేడాది కమలం పార్టీలో చేరారు. కేరళలోని పథనంధిట్ట నుంచి ఆయనకు టికెట్ దక్కింది. ఆ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏకే ఆంటోనీజీకి నేను చెప్పాలకునేది ఒక్కటే. మీ కుమారుడికి మీరు ఓటు వేయకపోయినా కనీసం ఆశీస్సులైనా అందించాలి. కొద్దిరోజుల క్రితం ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆంటోనీ ఇబ్బందిని అర్థం చేసుకోగలను. కాంగ్రెస్ ఒత్తిడి వల్ల అలా మాట్లాడి ఉండొచ్చు అని అన్నారు.