బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఉండాలంటే యోగికి జై కొట్టాల్సిందేనని హెచ్చరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయనివారు రాష్ట్రం వదిలి వెళ్లి పోవాల్సిందేనని యూపీ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీలో రెండు విడదల ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. హిందువులంతా ఏకమవ్వాలి. యోగీకి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల తరువాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం. యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందే లేకపోతే యూపీ వదిలి వెళ్లాల్సిందే. యూపీలో యోగిబాబా ప్రభుత్వం రాబోతుంది అంటూ యూపీ ప్రజల్ని హెచ్చరించారు.













