బిహార్ లో కొలువుదీరిన మంత్రివర్గం
బిహార్‌లో జేడీ(యూ)తో కూడిన మహా కూటమి ప్రభుత్వ కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. తాజాగా కేబినెట్ విస్తరణ చేపట్టారు సీఎం నితీశ్ కుమార్. 31 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన మంత్రుల చేత ప్రమాణం చేయించారు గవర్నర్ ఫాగు చౌహాన్. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఉన్నారు. కూటమిలో అత్యధిక సభ్యులు కలిగి ఉన్న ఆర్జేడీకి 16 మంత్రి పదవులు దక్కాయి. నీతీశ్ పార్టీ నుంచి 11 మంది ప్రమాణ స్వీకారం చేయగా, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంరీaకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్‌లు ఇచ్చారు.













