బీజీపీకి సుప్రీంకోర్టు ఝలక్… ఆప్ కు భారీ విజయం
ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటువేసే హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లను వేయర్ కోసం జరిగే ఓటింగ్‌కు ప్రిసైడిరగ్ ఆఫీసర్ సత్య శర్య (బీజేపీ) అనుమతించారు. ఈ తరుణంలో వాళ్లంతా బీజేపీకే ఓటేస్తారని, సత్యశర్మ బీజేపీ గనుక సొంత పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆప్ మొదటి నుంచి వాదిస్తోంది. పైగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) యాక్ట్ 1957 ప్రకారం నామినేటెడ్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హత లేదని గుర్తు చేసింది. ఈ తరుణంలో మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిద పడగా, ఆప్ సుప్రీంను ఆశ్రయించింది. ఆప్ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు నామినెటేడ్ సభ్యులకు ఓటింగ్‌లో పాల్గొనే అర్హత లేదని స్పష్టం చేసింది. అంతేకాదు 24 గంటల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ ఇవ్వాలని, ఎన్నిక నిర్వహణ తేదీని కూడా స్పష్టంగా ప్రకటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నికపై ప్రతిష్ఠంభన తొలిగిపోయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.













