రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగింది. ఇప్పటికే ఒక దఫా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగగా తాజాగా మరికొందరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్ల రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. భారతీయ జనతా పార్టీ దివంగత నేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్కు ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన కుమారుడు రాజ్వీర్ సింగ్ అందుకున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మరికొందరికి కూడా ఈ వేడుకల్లో రాష్ట్రపతి అవార్డులు అందజేశారు.













