చైనా యాప్ ల నిషేధం.. అంకుర పరిశ్రమలకు అవకాశం
టిక్ టాక్తో సహా చైనా యాప్లన్నిటినీ భారత్ నిషేధించడాన్ని స్వాగతిస్తూ ఈ చర్య అమెరికా, భారత్ దేశాల్లో అంకుర పరిశ్రమలకు చక్కని అవకాశంగా అమెరికా-ఇండియా బిజినెస్ అడ్వొకసీ గ్రూపు సూచించింది. అమెరికా- భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య ఫోరమ్ అధ్యక్షుడు ముఖేష్ అఘి ఇది భారత్ అంతర్గత భద్రతా సమస్యగా పేర్కొన్నారు. అంతర్గత భద్రత పరిరక్షణకు భారత్ తీసుకున్న ఈ చర్యను తాము సమర్దిస్తున్నామని చెప్పారు. ఇది అమెరికా కంపెనీలకే కాకుండా భారత్ కంపెనీలు కూడా స్వదేశీ యాప్లను రూపొందించడానికి మార్కెట్ అనుసంధానాన్ని పెంపొందించుకోవడానికి తగిన అవకాశంగా పేర్కొన్నారు.













