చరిత్ర సృష్టించిన భజరంగ్.. భారత్ కు మరో పతకం
టోక్యో ఒలింపిక్స్ లో భజరంగ్ పూనియా చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం ఒలింపిక్స్ లోనే కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ దౌలత్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఉడుం పట్టు అంటే ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించిన భజరంగ్ తన కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. అంతేగాక ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలోకి దేశానికి పతకం అందించిన ఆరో రెజ్లర్‌గా నిలిచాడు. ఇదే ఒలింపిక్స్ లో రవి కుమార్ దహియా రజతం గెలవగా.. తాజాగా భజరంగ్ కాంస్యం గెలిచాడు. కేడీ జాదవ్ (కాంస్యం), సుశీల్ కుమార్ (కాంస్యం, రజతం), సాక్షి మాలిక్ (కాంస్యం) యేగేశ్వర్ దత్ (కాంస్యం), రవి దహియా (రజతం) గెలిచారు.













