ఆజాద్ బాటలోనే ఆనంద్ శర్మ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ మేరకు లేఖరాశారు. హిమాచల్లో పార్టీ సమావేశాలకు తనను ఆహ్వానించడం లేదని, ఎన్నికలకు సంబంధించి ఏ విషయంలోనూ తనను సంప్రదించడం లేదని పేర్కోన్నారు. ఫలితంగా తన ఆత్మ గౌరవం దెబ్బతిందని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అయితే రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం మాత్రం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఆనంద్ శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 26న నియమితులైన సంగతి తెలిసిందే.













