యోగి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ను తోసిపుచ్చింది అలహాబాద్ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను బుట్టదాఖలు చేస్తూ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండానే అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ సౌరవ్ లావానియాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్ 5న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తర్ ప్రదేశ్లోని 200 మున్సిపల్ కౌన్సిల్ 54 చైర్పర్సన్ సీట్లు ఓబీసీలకు కేటాయిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 18 మహిళలకు కేటాయించింది. అలాగే 545 నగర పంచాయతీల్లో 147 సీట్లు ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించింది. అందులో 49 మహిళలకు కేటాయించారు. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.













