మహాత్మాగాంధీ తర్వాత మోదీయే
మహాత్మాగాంధీ తర్వాత భారత సమాజం, ప్రజల అంతరంగం లోతుగా తెలిసిన ఏకైక నేత ప్రధాని నరేంద్ర మోదీయేనని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ రెండు దశాబ్దాల పాలన అంశంపై జరిగిన జాతీయ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ సవాళ్లను ఆయన ఎలా అధిగించారో చూస్తే సమాజంపై ఆయనకు ఎంతటి అవగాహన ఉందో తెలుస్తుందని అన్నారు. మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్యార్థులకు సమర్థ నాయకత్వం, సమర్థవ పాలన అంశంపై రెండు దశాబ్దాల మోదీ రాజకీయ ప్రస్థానాన్ని పాఠ్యాంశంగా చేయాలన్నారు. 20 ఏళ్ల పాలనాకాలంలో ఆయనపై ఎటువంటి అవినీతి మరక పడలేదన్నారు. ప్రధాని మోదీని 24 క్యారెట్ల బంగారం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. 100 ఏళ్ల క్రితం గాంధీజీ స్వదేశీ 4.0కు కొత్త నిర్వచనం చెప్పారన్నారు.













