ఎంతో మంది ఆయనను చంపాలని చూస్తున్నారు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రపంచంలో చాలా మంది చంపాలని చూస్తున్నారని, తనతో పోలిస్తే ఆయన ప్రాణాలకే ఎక్కువ ముప్పు ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ప్రస్తుత పరిస్థితి నాకంతే పుతిన్‌కే ఎక్కువ ప్రమాదకరంగా ఉంది. రష్యాలో మాత్రమే నన్ను చంపాలనుకుంటున్నారు. పుతిన్‌ను ప్రపంచంలో చాలా మంది హత్య చేయాలని చూస్తున్నారని అన్నారు. యుద్దంలో వాగ్నర్ ముఠాకు తమ సైన్యం చుక్కలు చూపించిందని తెలిపారు. మా దళాలు దాదాపు తూర్పు ఉక్రెయిన్‌లోనే 21,000 మంది వాగ్నర్ సైనికులను హత మార్చాయి. మరో 80,000 మందిని గాయపరిచాయి అని వెల్లడిరచారు.













