బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో జెలెన్స్కీ భేటీ!
ఎలాంటి ముందస్తు ప్రకటనలు, హడావుడి లేకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హఠాత్తుగా యూకే పర్యటనకు వెళ్లారు. ఆయన ఈ పర్యటనలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జెలెన్స్కీ ఓ ట్వీట్లో ద్రువీకరించారు. కీలకమైన చర్చల కోసం మిత్రుడు రిషి సునాక్‌తో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మరింత సైనిక సాయం కోరే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ పర్యటనపై సునాక్ కూడా స్పందించారు. మేము ఉక్రెయిన్ను వదిలేయం. యుద్ధంలో ఇది చాలా కీలకమైన సమయం. పుతిన్ యుద్ధ క్షేత్రం ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగం లోపల ఉంది. దీని ప్రభావం ప్రపంచమంతా విస్తరించి ఉంది. ఉక్రెయిన్ విజయం సాధించి, పుతిన్ దౌర్జన్యానికి ప్రతిఫలం దక్కకుండా చేయడమే మా లక్ష్యం అని వెల్లడించారు.













