ఇక రష్యా భూభాగంలోనే.. జెలెన్స్కీ హెచ్చరిక
రష్యాను ఎదుర్కొనే విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎంత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా యుద్ధం క్రమంగా రష్యా, భూభాగానికి మారుతోందంటూ తాజాగా ఆయన హెచ్చరించారు. రష్యా భూభాగంపై దాడులు రెండు దేశాల మధ్య యుద్దంలో అనివార్యమేకాకుండా సహజమైన న్యాయ ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ నానాటికీ మరింత బలపడుతోందన్నారు. రష్యా భూభాగంలోనే యుద్ధమని జెలెన్ స్కీ చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రతీకార దాడి అన్నట్టుగా రష్యా బాలిస్టిక్ క్షిపణులు ఉక్రెయిన్పై విరుచుకుపడ్డాయి. జెలెన్ స్కీ స్వస్థలం సెంట్రల్ ఉక్రెయిన్లోని క్రివి రిప్ాలో ఉన్న ఒక అపార్ట్మెంట్ కాంంప్లెక్స్, ఒక యూనివర్సిటీ భవనంపైకి క్షిపణుల దాడి జరిగింది. దాడులో ఐదుగురు చనిపోయినట్లు ప్రాథమికంగా తెలిసింది. 64 మంది గాయాలపాలయ్యారు.













