ఉక్రెయిన్ ముందుకు.. రష్యా వెనక్కి
ఉక్రెయిన్ భూభాగాలను తమ దేశంలో అధికారికంగా విలీనం చేసుకున్నామని ఘనంగా ప్రకటించిన రష్యా, ఇప్పుడు ఆ ప్రాంతాలను నిలుపుకోలేక అష్టకష్టాలు పడుతోంది. డొనెట్స్క్ ప్రాంతంలోని లీమన్‌ను పూర్తిగా ఉక్రెయిన్ దళాల వశం చేసుకున్నాయి. అక్కడ రష్యా పతాకాన్ని తొలగించి తమ జెండాను ఎగరవేశాయి. డాన్‌బాస్‌లోని చాలా ప్రాంతాల్లో ముందుకు దూసుకుపోతున్నాయి. లీమన్ నగరం పూర్తిగా తమ ఆధీనమైనందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు అధ్యక్షుడు స్వగ్రామం, ఇతర ప్రాంతాలపై రష్యా ఆత్మాహుతి డ్రోన్లతో దాడులు చేసింది. లీమన్ చేజారడం, రాజకీయంగా మాస్కోకు అతిపెద్ద ఎదురుదెబ్బ అని బ్రిటన్ సైన్యం పేర్కొంది.













