రష్యాపై ఫిడే నిషేధం
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) రష్యాను సస్పెండ్ చేసింది. ఇక ఫిడే నిర్వహించే ఏ టోర్నీలోనూ రష్యా ఆటగాళ్లు పాల్గొనలేరు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాకు సహకరిస్తున్న బెలారస్‌పై కూడా నిషేధం పడిరది. అయితే ఆ రెండు దేశాల క్రీడాకారులు ఫిడే పతాకం కింద టోర్నీల్లో పోటీ పడొచ్చు. ఐఓసీ సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఫిడే.. రష్యా, బెలారస్ జాతీయ జట్లను తాను నిర్వహించే అన్ని టోర్నమెంట్ల నుంచి నిషేధించింది అని ఫిడే ఓ ప్రకటనలో తెలిపింది. ఐఓసీ సూచన మేరకు ఇప్పటికే అనేక క్రీడా సంఘాలు రష్యాపై నిషేధం విధించాయి.













