చీఫ్ సైంటిస్ద్ పదవికి రాజీనామా చేయనున్న.. సౌమ్య స్వామినాథన్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ డా.సౌమ్య స్వామినాథన్ ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. నవంబర్ 30న చీఫ్ సైంటిస్ట్ పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు ఆమె. ఆ తర్వాత భారత్ రావాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. 63 ఏళ్ల వయసున్న సౌమ్య స్వామినాథన్ డబ్ల్యూహెచ్‌వోలో ఇప్పటి వరకు ఐదేళ్లపాటు పనిచేశారు. పదవీ విరమణకు ఇంకా సమయం ఉన్నప్పటికే రెండేళ్ల ముందస్తుగానే చీఫ్ సైంటిస్ట్ పదవికి రాజీనామా చేయనున్నారు. కొన్ని ఆచరణీయ కార్యక్రమాలపై విస్తృతంగా పనిచేయాలని భావిస్తున్నానని, భారత్‌లోనే ఉంటూ తన సేవలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు సౌమ్య స్వామినాథన్ వెల్లడిరచారు.













