ఆస్టిన్ యూనివర్సిటీతో యూపీ ప్రభుత్వం ఒప్పందం!
ఉత్తరప్రదేశ్‌లో 42 బిలియన్ డాలర్లతో (సుమారు రూ.3 లక్షల కోట్లు) నాలెడ్జ్ స్మార్ట్‌సిటీ నిర్మాణానికి అమెరకాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఆస్టిన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు యోగి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. 5 వేల ఎకరాల్లో నిర్మించనున్న నాలెజ్డ్ సిటీలో ప్రపంచంలోనే ఆత్యున్నత యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. అయితే ఈ ఒప్పందం ఓ స్కామ్ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీ సొంత వైబ్‌సైట్ ప్రకారమే ఆ వర్సిటీలో విద్యార్థులు ఎవరూ లేరు. కేవలం 25 మంది స్టాఫ్ మెంబర్లు ఉన్నారు. ఈ వర్సిటీ ఆక్రెడిటేషన్ను కూడా అమెరికా ప్రభుత్వం గత నెలలో రద్దు చేసింది.













