ఆ దేశానికి 6,140 కోట్ల డాలర్ల సాయం : అమెరికా
రష్యాను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్‌కు 25 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ సాయం చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశానికి 6,140 కోట్ల డాలర్ల అదనపు సాయం చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభించకపోతే ఇదే చివరి విడత ప్యాకేజీ కావచ్చని అధికారులు చెబుతున్నారు. తమ నిల్వల నుంచి క్షిపణులు, ఫిరంగులు, ఇతర ఆయుధ వ్యవస్థలను ఉక్రెయిన్ పంపించనున్నారు. అనుబంధ నిధులకు అమెరికా చట్టసభ సమ్మతించకపోతే తమ నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉన్నందువల్ల ఇక సాయం సాధ్యం కావకపోవచ్చని పెంటాన్ అధికార ప్రతినిధి తెలిపారు.













