అమెరికా, దక్షిణ కొరియా మధ్య కీలక ఒప్పందం!
వరుస క్షిపణి పరీక్షలతో అణు విన్యాసాలతో ఉత్తరకొరియా బెదిరిస్తున్న వేళ అమెరికా, దక్షిణ కొరియా మధ్య కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇందులో భాగంగా ఇక నుంచి అమెరికా అణు జలాంతర్గాములు దక్షిణ కొరియా నౌకాశ్రయాల్లో కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఈ మేరకు రెండు దేశాల అధ్యక్షులు ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూ సుక్ యోల్ అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ఖరారైతే దక్షిణకొరియాలో అమెరికా జలాంతర్గాములు మోహరించడం గత 40 ఏళ్లలో తొలిసారి కానుంది. ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతున్న 1970లో అమెరికా విమాన యుద్ధవాహక నౌకలు, అణు జలాంతర్గాములు తరచూ దక్షిణ కొరియా నౌకాశ్రయాల్లో సంచరించేవి.













