అమెరికాలో జిల్లా జడ్జిగా బంగ్లా అమెరికన్
బంగ్లాదేశీ అమెరికన్ లాయర్ నస్రత్ జహాన్ చౌదరి అమెరికాలో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఆమె కొలంబియా యూనివర్సిటీ నుంచి బ్యాచులర్స్ డిగ్రీనీ, ప్రిన్స్టెన్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల్లో మాసర్ట్స్ డిగ్రీని పొందారు. ఆమె డెన్నీస్ కోట్లో క్లర్క్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో వివిధ పదవులను నిర్వహించారు. ఆమెను గత ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జిల్లా జడ్జీగా నియమించారు. ఆమె సెనేట్ జ్యుడీషియరీ కమిటీలో కూడా పని చేశారు. న్యాయశాఖలో ఆమెకు విశేషమైన అనుభవం ఉంది.













