సమితి మానవహక్కుల మండలి నుంచి… రష్యా సస్పెన్షన్
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాను మానవహక్కుల మండలి నుంచి సస్పెండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానాన్ని ఆమోదించింది. అమెరికా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 197 సభ్యులతో కూడిన ఐరాస విభాగం దీనిపై ఓటింగ్ చేపట్టింది. తీర్మానానికి అనుకూలంగా 93 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 24 ఓట్లు పోలయ్యాయి. భారత్ సహా 58 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఐరాస మానవ హక్కుల మండలిలో 47 సభ్యదేశాలున్నాయి. సాధారణ అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు రహస్య బ్యాలెట్ ద్వారా నేరుగా ఎన్నుకోబడతారు. ఏదైనా సభ్యదేశంపై మానవహక్కుల ఉ్లంఘన ఆరోపణలు వచ్చినప్పుడు, జనరల్ అసెంబ్లీ సభ్యులతో మూడిరట రెండొంతుల మెజారిటీతో కౌన్సిల్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తారు.













