రిషి సునాక్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి… తక్షణమే కావాలి
ఐరోపాలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బ్రిటన్ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌తో సమావేశమయ్యారు. ఆయుధాలు, ముఖ్యంగా ఫైటర్ యుద్ధ విమానాలు తక్షణమే కావాలని జెలెన్స్కీ కోరారు. సునాక్ సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, యుద్ధం మధ్యలో ఆ దేశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మందుగుండు, ట్యాంకులు, సైనిక వాహనాలతో బ్రిటన్ తమకు నిరంతర సాయం అందిస్తూనే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. త్వరలో వందల సంఖ్యలో గగనతల రక్షణ వ్యవస్థలు, సుదీర్ఘ శ్రేణి డ్రోన్లు (200 కిలోమీటర్ల దూరం) అందివ్వనున్నట్లు సునాక్ ప్రకటించారు. ఐరోపా పర్యటనలో భాగంగా జెలెన్స్కీ ఇటలీ ప్రధానిని, పోప్ ప్రాన్సిస్‌ను కలిశారు.













